![]() |
![]() |
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -831 లో..... డాక్టర్ దగ్గరికి రాజ్ వచ్చి తల్లి బిడ్డని కాపాడే మార్గం చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తాడు. వేరే ఆప్షన్ లేదు.. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అబార్షన్ చేయించండి అని డాక్టర్ చెప్తుంది. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది.. మా వాళ్ళ కాదని చేతులు దులుపుకుంటారు.. ఎందుకు అలాంటప్పుడు హాస్పిటల్ లు మీరు ఎందుకు అని డాక్టర్ పై రాజ్ సీరియస్ అవుతాడు.
రాజ్ కోపంగా బయటకి వస్తాడు. సారీ డాక్టర్ అని కళ్యాణ్ చెప్తాడు. అర్థం చేసుకోగలను కానీ మీరు అయితే త్వరగా అబార్షన్ చేయించండి అని డాక్టర్ చెప్తుంది. రాజ్ దగ్గరికి కళ్యాణ్ వచ్చి అన్నయ్య ఎందుకు టెన్షన్ పడుతున్నావని అంటాడు. నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేసానని కళ్యాణ్ చెప్తాడు. మరొకవైపు స్వప్న దగ్గరికి రాహుల్ వస్తాడు. ఏంటి ఈ అవతారం ఏదో పనికి వెళ్లినట్టు అని స్వప్న అనగానే నిజంగానే పనికి వెళ్ళాను.. మూటలు మోసి వచ్చాను.. ఇదిగో వెయ్యి రూపాయలు అని స్వప్న చేతికి రాహుల్ డబ్బు ఇస్తాడు. ఎంటి ఇంత మార్పు అని స్వప్న అనగానే అంటే నా కూతురు కోసమని రాహుల్ ఎమోషనల్ గా మాట్లాడుతాడు.
మరొకవైపు రాజ్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి.. కావ్య గురించి చెప్పి రిపోర్ట్స్ పంపిస్తాడు. అవి చూసి అతను కూడా అబార్షన్ చెయ్యాలని చెప్పడంతో రాజ్ ఇంకా ఫ్రస్ట్రేషన్ అవుతాడు. రాజ్ ఇంటికి రాగానే రాజ్ ఆఫీస్ కి వెళ్ళు అని సుభాష్ అంటాడు. నేను వెళ్ళనని రాజ్ తన తండ్రి సుభాష్ పై సీరియస్ అవుతాడు. దాంతో అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో రాజ్ ఒక డాక్టర్ కి ఫోన్ చేసి మాట్లాడతాడు. మీ భార్యకి అబార్షన్ కాకుండా ఒక ఛాన్స్ ఉంది. అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అంటుంది. రాజ్ ఫోన్ మాట్లాడి వెనక్కి చూసేసరికి కావ్య ఉంటుంది. నాకు కళ్యాణ్ అంతా చెప్పాడని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |